ఒకసారి చదివినంత మాత్రాన మన సమస్త పాపాలని తీసేస్తుంది.

పేజీలు

5, మే 2010, బుధవారం

పరిచయం


రామాయణం అందరికీ తెలుసు, కాకపోతె కొన్ని విషయాల్లో మనకి చాలా అపోహలు ఉన్నాయి, మనకి రామాయణం క్లుప్తంగా తెలుసు, పూర్తిగా అందరికి తెలీదు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన రామాయణ ప్రవచనాన్ని నేను అందరికి అర్ధమయ్యేలా, వివరంగా, తెలుగులో తప్పులు లేకుండా రాశాను. ఆయన మొత్తం 42 రోజుల్లో ఈ రామాయణ ప్రవచనాన్ని కాకినాడలో చెప్పారు.

రామాయణం 24 వేల శ్లోకాలు. మొత్తం 6 కాండలు, అవి, బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర, యుద్ధ కాండలు, 6 కాండల మీద ఒక కాండ, ఉత్తర కాండ. రామాయణాన్ని ఆదికావ్యం అని అంటారు. కేవలం రాక్షససంహారం కోసమే రామావతారము వస్తే, రావణుడిని చంపిన తరువాత ఆయన అవతార సమాప్తం చెయ్యాలి, కాని ఆయన బాలకాండలో ఒక ప్రతిజ్ఞ చేశారు, అదేంటంటే, "దశవర్ష సహస్రాణి దశవర్ష శతానిచ ", నేను పదకొండువేల సంవత్సరాలు ఈ భూమండలం మీద ఉండి, ఈ భూమండలాన్నంతటిని పరిపాలిస్తాను అని. రాముడు 14 సంవత్సరాలు అరణ్యాలలో గడిపాడు, భగవంతుడు కనుక, రాముడు తన తండ్రిని చాలా గౌరవించాడు, భగవంతుడు కనుక, రాముడు నిరంతరం ధర్మాన్ని పాటించాడు, భగవంతుడు కనుక, రాముడు తన జీవితంలో ఒక భార్యతోనే ఉన్నాడు, భగవంతుడు కనుక, ఇలా అనుకుంటే రామాయణం యొక్క ప్రయోజనం ఏమి ఉండదు. రామాయణంలో రాముడు ఒక భగవానుడిలాగ బతికి చూపించలేదు, ఒక మనిషిలాగ బతికి చూపించాడు. మనం ఎలా బతకాలో చూపించాడు.

అందుకే రామాయణం ఎంతకాలం ఉంటుందో, ఎంతకాలం చెప్పుకుంటామో, ఎంతకాలం చదువుతామో, ఎంతకాలం రామాయణం మీద విశ్వాసం ఉంటుందొ, అంత కాలం మానవత్వం ఉంటుంది. మానవత్వం లేనప్పుడు మనిషిగా పుట్టి ప్రయోజనం లేదు. తల్లితండ్రుల దెగ్గర, సోదరుల దెగ్గర, గురువుల దెగ్గర, భార్య దెగ్గర ఎలా ఉండాలొ, ఒక మాటకి కట్టుబడి ఎలా ఉండాలొ రాముడిని చూసి నేర్చుకోవాలి.

యత్ర యత్ర రఘునాధ కీర్తనమ్,తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్
బాష్పవారి పరిపూర్ణలోచనమ్,మారుతిం నమత రాక్షసాంతకమ్.

ఎక్కడన్నా రామాయణం గూర్చి మాట్లాడుతుంటె స్వామి హనుమ తప్పకుండా వచ్చి వింటారు.

రామ అంటె లోకులందరినీ రమింపచేసే నామం. రావణాసురుడు బ్రహ్మ దేవుడి గురించి తపస్సు చేసి నరవానరములు తప్ప అన్ని జీవరాశులతో చావు రాకూడదని వరం కోరుకున్నాడు. నరవానరాలని ఎందుకు విడిచిపెట్టావు అని బ్రహ్మ అడగలేదు, రావణుడే చెప్పాడు, ఇంతమందిని అడిగాను నాకు నరవానరాలు ఒక లెక్క అన్నాడు. రావణుడి దృష్టిలో మనుషులకి ఉన్న స్థానం అది. నరుడంటె అంత చులకనగా చూసే రోజుల్లో నరుడిగా పుట్టి, ఒక మనిషి తలుచుకుంటె ఏదన్నా సాధించగలడు అని నిరూపించినవాడు శ్రీరామచంద్రుడు. అందుకే మనిషిగా పుట్టిన ప్రతిఒక్కరు రామనామం చెప్పాలి.


కూజంతమ్ రామరామేతి మధురమ్ మధురాక్షరమ్
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్

రాముడి యొక్క ఆయనం(నడక) కనుక దీనికి రామాయణం అని వాల్మీకి మహర్షి పేరు పెట్టారు. అలాగే ఆయన రామాయణానికి సీతాయాశ్చచరితమ్ మహత్:, పౌలస్త్య వధ అనే పేర్లు కూడా పెట్టుకున్నారు.

24 కామెంట్‌లు:

  1. ramayanam raasindi valmiki maharshi...............aayana raasina raamayanam lo lakshmana rekha ledu, sabari raamudiki pallu koriki tinipinchadam ledu..........

    ilantivanni vere vallu raasina kalpita vishayaalu..........

    manam ave nijamani anukuntunnamu.........cinemaalalo kuda ave chupistaaru..........

    రిప్లయితొలగించండి
  2. Ramudu Aranyaa Kandam Lo Maamshaharam Thinaru Manam Ramayanam Chadhuvuthunamu Maamshaharam Thinavacha ?

    రిప్లయితొలగించండి
  3. Raamudu puttindi kshatriya vamsamlo..........kshatriyulu maamsaahaaram tinavachhu.......

    ramayanamlo raamudu narudila pravartinchadu, aayana ekkada devudila pravartinchaledu..........manam ela bathakaalo chupinchaadu.....

    raamudu, seetamma, lakshmanudu maamsaahaaram tinnaru.....vallu kshatriya vamsamlo puttaru kabatti ala cheyyadamlo tappemi ledu........adhi kshatriya dharmam........

    రిప్లయితొలగించండి
  4. Chenna Kesava Garu is very correct.

    I just finished Raja Gopalachari's Ramayanam - in which he explains mostly Valimiki Ramayanam as well as Kamban's Ramayanam.

    At the same time he differentiates between both versions.

    if one reads original Bhagavatam, there is no 'Radha'

    రిప్లయితొలగించండి
  5. మీ ప్రయత్నం బాగుంది. నిజమే కాలగమనంలో వాల్మీకిలో లేనివి చాలా విషయాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి అని పెద్దలు చెప్తూ వుంటారు.. గుహుడు నది దాటించినట్లు చెప్పబడుతూ వుంటుంది. కాని వాల్మీకి ప్రకారం గుహుని సేవకుడైన ఒక నావికుడు ఆ పనికి నియోగింపబడ్డాడు. గుహుడని ఏకనాథ రామాయణం లాంటి కొన్నింటిలో అలా వుందని పెద్దలు చెప్పగా విన్నాను.మిత్రులు భాగవతం ప్రస్తావించారు. రాధ పేరు చెప్పకుండ ధ్వనింపచేసినట్టు చెప్తారు.పోతన భాగవతం లో దశమ స్కంధంలో 1026 వ పద్యం కొమ్మకు బువ్వులు కోసినడిక్కడ...అని ప్రారంభమయ్యే పద్యం చూడండి.. "శరీరంలో ప్రాణంలాగ భాగవతానికి ప్రాణం రాధ. ప్రాణం కనపడనట్టే రాధ కనపడదు. ఆమె అనుగ్రహం వుంటేనే బృందావనం లోకి ప్రవేశం.'...ఈ మాటలు శ్రీ సామవేదం వారి ఉపన్యాసాలలో విన్నవి. కృషిని మరోసారి అభినందిస్తూ...శలవు

    రిప్లయితొలగించండి
  6. chaala bagundi mee blog, manchi prayathnam chesaru. Changanti gari sampoorna ramayanam vinnanu. alanti pravachanam written ga vunte baguntundi ani anukunnanu. mee blog lo kanipinchindi. Thanks for updating pravachanam in written.

    రిప్లయితొలగించండి
  7. Mee blog ee roje choosanu. Chala santoshinchinanu. Guruvu gari upanyasaalu ilaa likhita roopamulo choodamtam ide modatisari. Meeru deenini Granthaaluga prachurinchite marendariko ee Ramayana Kathamrutaanni andichina varoutaaru. Mee krushiki naa krutajnatalu.
    Gnana Bhaskar

    రిప్లయితొలగించండి
  8. Guruvu garu Ramayanam cheppindhi kakinada lo kadu may be guntur sharada peetham lo.

    రిప్లయితొలగించండి
  9. Sri Chenna Kesava garu,

    Srimad Valmiki Ramayanam anni kaandalu telugu verses and translations tho books ekkada dorukutayo meeku teluste koncham share chestara ?

    Thanks,
    Raghuram

    రిప్లయితొలగించండి
  10. Sri chenna kesavau kumar;
    Namaskaramulu.You have done Excellent work on valmiki Ramayana through Online.I read the all chapters(42)ValmikiRamayanam in 42days by grace Lord Sri rama.
    Thank you very much.

    రిప్లయితొలగించండి
  11. Sri chenna kesavau kumar,

    Naa peru ramakarishna, Neenu mee blog adhramgaa oka mobile application cheyalanukuntunna, ante mee blog lone content ne vadukuni ramayanam motham ok mobile application la tayaru cheddamanukuntunna. daniki mee data ne vadukovachaaa daya chesi telupagaru.

    రిప్లయితొలగించండి
  12. excellent.
    impressed by ur work.
    may god bless u.
    sarve janaa sukhino bhavanthu.
    sarve sujana sukhino bhavanthu.

    రిప్లయితొలగించండి
  13. me prayatnam koniyada taginadi inni rojulu e blog mis chesukunna nadi really bad luck 2016 is very good year nenu me blog open chesanu ramayanam tho kalasina peddala openions
    kuda chadivethini very very.........nice no words

    రిప్లయితొలగించండి
  14. This blog is very interesting, wonderful and encouraging worldwide telugu people to read RAMAYANA as told by Sri Sri Sri Chaganti garu. I am praying at the lotus feet of guruvu garu. Thanks for comingup with this blog. In more than a decade time, I think lakhs of people are reading here and benefiting towards shaping Sri Rama Rajjam.

    రిప్లయితొలగించండి